Showing posts with label కవితలు. Show all posts

Sunday, September 23, 2012

నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నిన్నుగా మలుచుకో.....


జీవితం ఒక పయనం,
మనుసులా మతిస్తిమితం.
ఎడారిలో ఎండమావిలా బంధం,
బాటలో బాటసారిలా శాశ్వతం.
నిన్ను నువ్వు తెలుసుకో,
నిన్ను నిన్నుగా మలుచుకో.
జననం నీకు తెలిపి రాలేదు,
మరణం నీకు చెప్పి రాలేదు.
ఆశల వలయాలు అనేకం,
అందుకో ఒక సుందర స్వప్నం.
నిద్రమత్తులో నీకున్నది బ్రాంతి,
అది తెలుసుకున్నప్పుడే నీకు క్రాంతి.
అపకారం కారాదు అర్ధం,
పరోపకారం కావాలి పరమార్ధం.
ఓటమి గెలుపుకి తొలిమెట్టు అనుకో,
విజయాన్ని ఆస్వాదించు ఎగిసే ఉత్సాహంతో.
By : SJ